![]() |
![]() |

త్వరలో ఉమెన్స్ డే వస్తున్న సందర్భంగా ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ షో మొత్తం విమెన్ స్పెషల్ గా రాబోతోంది. ఈ ఎపిసోడ్ లో ఆటో రాంప్రసాద్, బులెట్ భాస్కర్ లేడీ గెటప్స్ లో కనిపించారు. "సిఎస్ ఐ సనాతన్" మూవీ టీం నుంచి ఆది సాయికుమార్, వాసంతి వచ్చారు. రాకెట్ రాఘవ ఇందులో గంగూభాయ్ క్యారెక్టర్ లో కనిపించి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు.
ఆదితో చెప్పిన డైలాగ్స్ అందరినీ నవ్వించాయి "నీతో ఒక విషయం మాట్లాడాలి బావ..ఆ మధ్య మీ నాన్న గారు మా వాడకు వచ్చినప్పుడు వాడంతా తగలబడిపోయింది. ఎందుకంటే మీ నాన్న పేరు అగ్ని అంట. ఇప్పుడు అన్నీ బిల్డింగులు కట్టుకున్నాం. వీలైనప్పుడు నాన్నగారిని ఒకసారి వచ్చి పొమ్మని చెప్పు నాయనా" అనేసరికి ఆది పగలబడి నవ్వేసాడు. తర్వాత ఆది, భాస్కర్, నూకరాజు అంతా కలిసి లేడీ గెటప్స్ లో ఇళ్ల ముందు ముగ్గులు వేస్తూ పంచ్ డైలాగ్స్ తో నవ్వించేసారు. సౌజన్య, శిరీషా కలిసి సమ్మక్క, సారక్క గెటప్ లో ఒక డాన్స్ చేసి అలరించారు.
యాంకర్ రష్మీ ఆది సాయికుమార్ కి ఒక టాస్క్ ఇచ్చింది. అది చక్కగా పూర్తి చేసి చూపించాడు. ఇక లేడీస్ లో ఎవరైతే ఈ టాస్క్ కంప్లీట్ చేస్తారో వాళ్లకు ఆదితో కాండిల్ లైట్ డిన్నర్ ఉంటుంది అని అనౌన్స్ చేసింది రష్మీ. మరి ఎవరు ఈ టఫ్ టాస్క్ కంప్లీట్ చేసి ఆదితో డిన్నర్ కి వెళ్తున్నారో తెలియాలి అంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే..
![]() |
![]() |